Header Banner

ఫెయిలైన విద్యార్థులకు ఇంటర్ బోర్డు శుభవార్త! ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపుకు తుది గడువు ఇదే!

  Sat Apr 12, 2025 14:21        Education

ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఈ పరీక్షల్లో పదేళ్లలో కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఇదిలా ఉండగా.. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక సమాచారం ఇచ్చింది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ సప్లిమెంటరీ పరీక్షలు (AP Inter Supplementary Exams 2025) రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచి మొదలవుతాయి.. ఫీజు చెల్లింపు గడువు వంటి వివరాలను ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ జరుగనుంది.
మే 12 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు. ఈ పరీక్షను రాసేందుకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది.


ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!


అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి. ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఎలాంటి ఆందోళన పడకుండా.. సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని అధికారులు కోరుతున్నారు.
ఈరోజు (శనివారం) ఉదయం సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి అత్యధికంగా పాస్‌ పర్సంటేజ్ నమోదు అవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ప్రతీఏడు లాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికదే పై చేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 71 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 64 శాతం ఉత్తీర్ణత పొందారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో బాలికలు ఉత్తీర్ణత పొందగా.. బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APInterResults2025 #SupplementaryExams #InterSupplyExams #EducationNews